ETV Bharat / city

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్ పోటీలకు విశేష స్పందన - ఏపీలో సైన్స్ కాంగ్రెస్ పోటీల తాజా వార్తలు

ప్రస్తుత సమస్యలపై చిన్నారులు పరిశోధన చేయటం మంచి పరిణామని నిపుణులు చెపుతున్నారు . పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైన్స్ కాంగ్రెస్ పోటీలకు మంచి స్పందన లభిస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఢిల్లీశ్వరరావు తెలిపారు. 28వ రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలను విజయవాడ సైన్స్ సెంటర్​లో నిర్వహిస్తున్నారు.

online science exhibition competitions in andhra pradesh
రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్ పోటీలకు విశేష స్పందన
author img

By

Published : Jan 9, 2021, 4:18 PM IST

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్ పోటీలకు విశేష స్పందన

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైన్స్‌ కాంగ్రెస్ పోటీలకు విశేష స్పందన లభిస్తోంది. 28వ రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలను విజయవాడ సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించారు. కరోనా కారణంగా ఈసారి పోటీలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. ఒక్కొక్క జిల్లా నుంచి 10 ప్రాజెక్ట్​ల చొప్పున.. 130 ప్రాజెక్ట్​లు రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాయి. వీరిలో 17 మందిని ఎంపిక చేసి జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలకు పంపనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఢిల్లీశ్వరరావు తెలిపారు.

చిన్నారులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని.. ఆన్​లైన్​లో సైతం చక్కగా ప్రాజెక్ట్ వివరాలను చెప్తున్నారని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఢిల్లీశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని.. ఇంటివద్దే దొరికే మొక్కలతో శానిటైజర్, పౌడర్‌ తయారు చేయడం అబ్బురపరిచిందని ఢిల్లీశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియను బహిష్కరిస్తాం: ఉద్యోగ సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.