ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలా.. ఎక్కడ?.. సమాచారం లేదు.. ఆదేశాల్లేవు! - నామినేషన్లు స్వీకరించని అధికారులు న్యూస్

పంచాయతీ ఎన్నికల్లో పోటీపై ఆశతో పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లిన అభ్యర్థులకు తొలిరోజు సోమవారం నిరాశే ఎదురైంది. నామపత్రాలు, ఓటర్ల జాబితాలను ఇచ్చేందుకు అధికారులు ససేమిరా అన్నారు.

Officials did not take up panchayat election nominations

author img

By

Published : Jan 26, 2021, 8:14 AM IST

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్లిన అభ్యర్థులకు మెుదటి రోజు నిరాశే ఎదురైంది. ఎన్నికలపై తమకెలాంటి సమాచారం లేదని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేవని కార్యాలయ అధికారులు చెప్పారు. కొన్నిచోట్ల నిర్ణీత సమయానికి కార్యాలయాలనే తెరవలేదు. సిబ్బంది అందుబాటులో లేరు. తమ మద్దతుదారులతో వచ్చిన తెదేపా, జనసేన, భాజపా నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో మాత్రం ఇద్దరినుంచి నామినేషన్లను స్వీకరించి.. మళ్లీ తిరిగిచ్చి.. ఆనక తీసుకున్నారు. చివరకు రద్దు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ తలుపులు ఉదయం 11 గంటలకూ తెరచుకోలేదు.

* నామపత్రాల విషయమై పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో తెదేపా మద్దతుదారులు, పంచాయతీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహిస్తూ భీమడోలు మండలపరిషత్‌ కార్యాలయం వద్ద తెదేపావారు ఆందోళన చేశారు. నల్లజెర్ల మండలంలోని గంటావారిగూడెం, ఏలూరు గ్రామీణ మండలం వట్లూరు, చింతలపూడి మండలం సీతానగరంలో తెదేపా మద్దతుదారులు నామినేషన్‌ వేయడానికి వెళ్లగా అధికారులు అందుబాటులో లేరు.

* కృష్ణా జిల్లా గన్నవరంలో సీపీఎం నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి నామినేషన్లు తీసుకుంటున్నారో లేదోనని వాకబు చేశారు. రెడ్డిగూడెం పంచాయతీకి నామినేషన్‌ వేసేందుకు తమ మద్దతుదారులతో కలిసి వెళ్లిన తెదేపా నేతలకూ నిరాశే ఎదురైంది.

* విశాఖ జిల్లా పరవాడలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేయాలని మాజీ ఎంపీపీ అప్పారావు ఎంపీడీఓకు విన్నపమిచ్చారు. నామపత్రాలు ఇవ్వడం లేదని, ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు పెందుర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు మద్దతుదారులతో కలిసి తెదేపావారు వచ్చారు. పత్రాలివ్వాలని అధికారుల్ని కోరగా.. తమకు అందలేదని ఎంపీడీవో తెలిపారు. ఓటర్ల జాబితానైనా ఇవ్వాలని కోరగా.. అవీ సిద్ధంగా లేవని చెప్పారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదమేర్పడింది. రాపూరు మండలంలో సచివాలయాల్లో నామినేషన్లు వేసే అవకాశం లేకపోవడంపై తెదేపా నాయకులు ఎంపీడీవోను కలిసి ప్రశ్నించారు. వెంకటాచలం మండలంలోనూ నామినేషన్లు వేయడానికి అవకాశం లేక తెదేపా మద్దతుదారులు వెనుదిరిగారు.

* తెదేపాకు చెందిన మట్టా రాధ తూర్పుగోదావరి జిల్లా రాజోలు పంచాయతీకి నామినేషన్‌ వేయడానికి ఎండీపీఓ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు ఆమెను వెనక్కి పంపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు ఆందోళన చేశారు. ఉప్పలగుప్తం పంచాయతీ కార్యాలయానికి నామినేషన్‌ వేసేందుకు తెదేపా మద్దతుదారులు వెళ్లినా, ఉత్తర్వులు రాలేదనడంతో వెనుదిరిగారు. నామినేషన్లు స్వీకరించడం లేదంటూ ఆత్రేయపురం మండలం అంకంపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వచ్చినవారు ఆందోళన చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ అమలాపురంలో జనసేన, భాజపా నేతలు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

* అనంతపురం జిల్లా లేపాక్షిలో స్థానిక న్యాయవాది గంగాధర్‌ నామినేషన్‌ను సిబ్బంది తీసుకోలేదు. మడకశిర మండలం బుక్కసముద్రంలో జయపాల్‌కూ నిరాశే ఎదురైంది. రోళ్ల, సోమందేపల్లి పంచాయతీలకు, పెనుకొండ మండలంలోని గ్రామాల్లోనూ నామపత్రాలివ్వలేదు.

* కర్నూలు జిల్లా ఆస్పరి ఎంపీడీఓ కార్యాలయం తలుపులు తెరిచినా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు.

* చిత్తూరు జిల్లా పిచ్చాటూరు, బీఎన్‌కండ్రిగ మండలాల్లో నామినేషన్లు వేసేందుకు తెదేపాకు చెందిన అభ్యర్థులొచ్చారు. సత్యవేడు నియోజకవర్గ తెదేపా నేత జేడీ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో బీఎన్‌కండ్రిగ మండలంలోని పలు గ్రామాలకు నామినేషన్లు వేసేందుకు తెదేపా మద్దతుదారులొచ్చి పత్రాలు ఇవ్వకపోవడంతో వెనక్కిమళ్లారు.

* కడప లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి.. తమ మద్దతుదారులతో కలిసి చక్రాయపేట పంచాయతీలో నామినేషన్లు వేయించేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు.

అక్కడి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో మొదట 2నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని 7 కేంద్రాల్లో నామినేషన్లకు ఏడుగురు స్టేజ్‌-1 అధికారులను నియమించారు. రాష్ట్రంలోనే మొదట తక్కెళ్లపాడు పంచాయతీ 7, 8వ వార్డులకు అభ్యర్థులు లక్ష్మీనారాయణ, విజయ్‌ నామినేషన్లు సమర్పించారు. అవి నిబంధనల మేరకు లేకపోవడం, షెడ్యూలు మారడంతో రద్దు చేశారు.

ఇదీ చదవండి:

'ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి సాధ్యం కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.