తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా... కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి ఒకేషనల్ కోర్సులు ప్రారంభిస్తున్న తొలి కళాశాల తమదేనని విజయవాడ కేబీఎన్ కళాశాల కరెస్పాండెంట్, సెక్రటరీ టి.శ్రీనివాస్ తెలిపారు. వెబ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ సర్వీసెస్ లో UGC గుర్తింపు వచ్చిన వొకేషనల్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్లో లెక్కలను ఒక సబ్జెక్టుగా చదివిన విద్యార్థులు.. ఈ కోర్సు చేసేందుకు అర్హులని వెల్లడించారు. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు చేయడం వల్ల విద్యార్థులకు మొదటి సంవత్సరంలో డిప్లమా, రెండో ఏడాది అడ్వాన్స్డ్ డిప్లమా, మూడో ఏడాది పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టా ఇవ్వనున్నట్లు వివరించారు. డిప్లమా పూర్తి చేసిన వెంటనే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని, మొదటి సంవత్సం పూర్తి చేసిన తర్వాత... విద్యార్థుల అనుకూలతను బట్టి మిగిలిన రెండు సంవత్సరాలను ఎప్పుడైనా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందని కెబిఎన్ కళాశాల అకడమిక్స్ డైరెక్టర్ పి.ఎల్ రమేష్ తెలిపారు. పరిమితమైన సీట్లలోనే ప్రస్తుతం విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపిన యాజమాన్యం.. వచ్చే ఏడాది మరికొన్ని సీట్లు పెంచుతామని వెల్లడించింది.
ఇదీ చదవండీ :