ETV Bharat / city

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యంతరాలు - ఎన్టీఆర్‌ వర్సిటీలో నిర్వహించే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌పైఅభ్యంతరాలు

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా(బీ-కేటగిరి) సీట్ల ప్రవేశాలకు తాజాగా ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించింది. అయితే దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలిపారు.

objection to mbbs Counseling at ntr university
ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యంతరాలు
author img

By

Published : Jan 9, 2021, 3:16 AM IST

ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 795 బీ-కేటగిరి సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొదటి విడత పూర్తయ్యేసరికి 295 సీట్లు మిగిలాయి. రెండో విడత నిర్వహించగా.. 109 సీట్లు మిగిలాయి. ఈ సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని విద్యార్థులు ఎదురుచూశారు. కానీ.. మిగిలిన సీట్లను మాప్అప్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేశారు. దీనిపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మాప్అప్ అనడంతో ఆందోళన...

మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీ-కేటగిరి సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత సీట్లు వచ్చిన విద్యార్థులకు రెండో విడతలో మరో మంచి కళాశాలలో సీటొస్తే.. స్లైడింగ్‌ విధానంలో అక్కడికి వెళ్లిపోయేందుకు అవకాశం ఇచ్చారు. కానీ.. రెండో విడతలో సీటొచ్చిన విద్యార్థులకు స్లైడింగ్‌కు అవకాశం ఇవ్వకుండా కౌన్సెలింగ్‌ ముగించారు. మిగిలిన 109 సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్‌ పెడితే.. మరో మంచి కళాశాలకు మారొచ్చని చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా.. మాప్అప్‌ అనడంతో రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులు మరో కళాశాలకు మారే అవకాశం లేకుండాపోయింది.

రెండు రౌండ్లతోనే ముగింపు...

ఇప్పటివరకు కౌన్సెలింగ్‌లో సీట్లు రాని.. చివరి ర్యాంకుల అభ్యర్థులతో మిగిలిన సీట్లను మాప్అప్‌ రౌండ్‌లో భర్తీ చేస్తారు. దీనివల్ల వారి కంటే మంచి ర్యాంకులు వచ్చి రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి కళాశాలలో అవకాశం ఇచ్చి, తమకు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ కోసం ఐదు విడతల కౌన్సెలింగ్‌ను నిర్వహించి, మేనేజ్‌మెంట్‌ కోటాకు రెండు రౌండ్లతోనే ముగించడం ఏంటంటూ పలువురు తల్లిదండ్రులు విశ్వవిద్యాలయానికి వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు సంబంధించి 2019లో ఇచ్చిన జీవో 71 ప్రకారమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. నిబంధనల మేరకు రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించి మాప్అప్ పద్ధతి‌ పెట్టాం. - కె.శంకర్‌, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌.

ఇదీచదవండి:

ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్న ఎస్‌ఈసీ...మరికొన్నాళ్లు వాయిదా వేయాలన్న సీఎస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.