NTR varsity employees boycott duties from tomorrow: యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఎన్టీఆర్ వర్శిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు. అమరావతిలో ఎన్టీఆర్ వర్శిటీలో సమావేశమైన ఉద్యోగులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి సంఘాలు జేఏసీగా ఏర్పడినట్లు తెలిపారు. అంతకుముందు వీసి, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా వర్శిటీ ప్రాంగణంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు.
fight for funds: యూనివర్శిటీ నిధుల మళ్లింపును నిరసిస్తూ.. విధులు బహిష్కరిస్తామని ప్రకటించిన ఉద్యోగులు.. ఏం చేసైనా సరే నిధులు కాపాడుకుంటామని తెలిపారు. అలాగే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌కు వర్సిటీ పరిణామాలపై నివేదిస్తామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
employees jac: సీఎంవో నుంచి ఒత్తిడితో యూనివర్సిటీ నిధులు మళ్లిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అప్పులు పుట్టక.. సంస్థల నిధులు మళ్లిస్తుందని విమర్శించారు. తాజా నిర్ణయంతో ఉద్యోగులను, వర్శిటీని రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. అన్ని సంఘాల నేతలు కలిసి జేఏసిగా ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు.
మంత్రి సురేష్ స్పందన..
Minister Suresh respond on NTR varsity issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నా పరిధిలో లేదంటూ మంత్రి సురేశ్ తెలిపారు. వర్శిటీల్లో ఇబ్బందులుంటే నిధుల జోలికి ప్రభుత్వం పోదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
Jagananna Vidyadeevena: జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల