ETV Bharat / city

NTR Trust: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కొవిడ్ రోగులకు ఉచిత సేవలు - NTR Trust Services Start to Covid Patients

NTR Trust Covid Helpline services Restart: కొవిడ్ బాధితులకు తమవంతు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ముందుకొచ్చింది. ఆన్​లైన్ ద్వారా నేరుగా వైద్యులతో కొవిడ్ బాధితులు మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు కొవిడ్ రోగుల‌కు వైద్య సూచ‌న‌లు ఇవ్వనున్నారు.

NTR Trust
NTR Trust
author img

By

Published : Jan 19, 2022, 9:09 PM IST

NTR Trust Start Services for Covid Patients: కొవిడ్ బాధితులకు తమవంతు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చింది. మేనేజింగ్ ట్రస్టీ నారా భువ‌నేశ్వరి ఆదేశాలతో ఉచిత వైద్య సేవలు పునఃప్రారంభంకానున్నాయి.. కొవిడ్ బాధితుల‌కు టెలిమెడిసిన్ కోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆన్​లైన్ ద్వారా నేరుగా వైద్యులతో కొవిడ్ బాధితులు మాట్లాడేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ వైద్యులు లోకేశ్వరావుతో పాటు రాష్ట్రంలోని నిపుణుల‌తో ఈ వైద్య బృందం ఏర్పాటైంది.

ప్రతి రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు జూమ్ కాల్ ద్వారా కొవిడ్ రోగుల‌కు వైద్య సూచ‌న‌లు ఇవ్వనున్నారు. రోగుల‌కు అవ‌స‌రమైన మందులు, మెడిక‌ల్ కిట్ల‌ను సైతం ఎన్టీఆర్ ట్రస్టు అందుబాటులోకి తెచ్చింది. గ‌త ఏడాది కొవిడ్​ సమయంలో రూ. కోటి 75 లక్షల ఖర్చుతో పలు సేవ‌లు అందించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా... ఇప్పటికే కుప్పంలో ఓ ఆక్సిజ‌న్ ప్లాంట్​ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రారంభించారు. శ్రీ‌కాకుళం జిల్లా టెక్కలి, తెలంగాణలోని మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరులో ప్లాంట్ ఏర్పాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గ‌త ఏడాది కొవిడ్ స‌మ‌యంలో ల‌క్షల మందికి ఇంటి వద్ద ఆహారాన్ని ఎన్టీఆర్ ట్రస్టు ప్రతినిధులు అందజేశారు. ఇప్పుడు కొవిడ్ తీవ్రత పెరిగినందున ట్రస్ట్ సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు.

ఇదీ చదవండి..

AP CORONA CASES : భారీగా పెరుగుతున్న కరోనా కేసులు...కొత్తగా 10,057 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.