2020-21 విద్యా సంవత్సరం వైద్య విద్యలో ప్రవేశం పొందేందుకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈనెల 10న ఉదయం 8 నుంచి 13న రాత్రి 8 వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. అభ్యర్ధులు ఒకేసారి ఆప్షన్స్‌ను నిర్ణయించుకోవాలని సూచించారు. మొదటిసారి పొందుపరిచిన కళాశాలల ఆప్షన్స్ ఆధారంగానే తొలి, మలి విడత, మాప్ అప్ కౌన్సెలింగ్‌లు జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: