ETV Bharat / city

RGUKT: ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల - RGUKT LATEST NEWS

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయా(RJUKT)ల్లో.. ట్రిపుల్‌ ఐటీల్లో 2021-2022 ఏడాది ప్రవేశాల నోటిఫికేషన్‌(IIIT admissions) శుక్రవారం విడుదలైంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు.

iiit admissions
ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల
author img

By

Published : Oct 23, 2021, 10:07 AM IST

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు ప్రవేశాల కన్వీనరు ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. ప్రవేశాల కోసం ఆర్జీయూకేటీసెట్‌-21ని సెప్టెంబరు 26న నిర్వహించగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 70,131 మంది రాశారు. వారిలో నుంచి 4,400 (ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీతో కలిపి) సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. ప్రత్యేక విభాగాల వారికి కౌన్సెలింగ్‌ను నవంబరు 8 నుంచి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించనున్నారు. జనరల్‌ కౌన్సెలింగ్‌ను నవంబరు 22 నుంచి 30 వరకు నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌ల్లో ఏక కాలంలో నిర్వహిస్తారు.

.

ఇదీచదవండి..

HC ON KAKINADA MAYOR: 'మా ఆదేశాలకు విరుద్దంగా ఎందుకు వ్యవహరించారు?.. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.