ETV Bharat / city

"రాంగోపాల్‌ వర్మకు నోటీసులు ఇస్తాం"

Notice to RGV: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై.. అభ్యంతరకర ట్వీట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. వర్మ తన ట్వీట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.

notice will be given to director ramgopal varma
రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇస్తాం: వాసిరెడ్డి పద్మ
author img

By

Published : Jun 26, 2022, 8:27 AM IST

Notice to RGV: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై.. అభ్యంతరకర ట్వీట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘‘మానవ అక్రమ రవాణా’’పై దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌, బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.

వర్మ తన ట్వీట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యచరణ ప్రణాళికను జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మకు నివేదించినట్లు ఆమె తెలిపారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసు శాఖ సమన్వయంతో మహిళా కమిషన్‌ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట కమిషన్‌ రాష్ట్ర కార్యదర్శి వై.శైలజ ఉన్నారు.

ఇవీ చూడండి:

"భూలోక వాసులారా.. నేను వేలాడబోతున్నా.." మంచు లక్ష్మి "చిత్రాలు"!

'కాపు నేస్తం'లో 41వేల పేర్లు గల్లంతు.. లబ్ధిదారుల్లో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.