పల్లెపోరు మూడోవిడతలో తొలిరోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. అభ్యర్థులు పెద్దఎత్తున నామపత్రాలు సమర్పించారు. గుంటూరు జిల్లాలో సర్పంచ్ స్థానాలకు... 99 మంది వార్డుస్థానాలకు 427 మంది నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలో 530 మంది సర్పంచ్ అభ్యర్థులుగా..15 వందల 5 మంది వార్డుస్థానాలకు నామపత్రాలు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 159... వార్డు స్థానాలకు 164 నామపత్రాలు దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలో 251 మంది, అనంతపురం జిల్లాలో 64 మంది , కర్నూలు జిల్లాలో 114మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు.
పంచాయతీ ఎన్నికల రెండో విడతలో నామినేషన్‌లు వేసిన అభ్యర్థుల ప్రచారం జోరుగా చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. వత్సవాయి మండలంలోని పర్యటించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే..... వైకాపా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెండ్యాలలో వైకాపా నేత మొండితోక అరుణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు మండలం శనగపాడులో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైకాపా బలపరిచిన అభ్యర్థినే గెలిపించాలంటూ... ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
తొలిదశ ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరగా...ఆశావాహులు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులను పట్టుకుని ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, పెద్దాపురం పరిధిలో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి తరపున మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రచారం నిర్వహించారు. తుమ్మపూడి, చిలువూరు, మోరంపూడి గ్రామాల్లో తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నేత నక్కా ఆనంద్‌బాబు పిలుపునిచ్చారు.
ఇదీచదవండి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు