ETV Bharat / city

Municipal Elections: స్థానిస సంస్థల ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - Nomination for municipal elections in ap

రాష్ట్రంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తేదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు నామపత్రాల సమర్పణకు మున్సిపల్ కార్యాలయాలకు తరలివచ్చారు. కౌన్సిలర్ అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలతో కార్యాలయాలు సందడిగా మారాయి. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్థానిస సంస్థల ఎన్నికలకు ముగిసిన నామినేషన్ గడువు

author img

By

Published : Nov 5, 2021, 10:05 PM IST

Updated : Nov 6, 2021, 7:15 AM IST

రాష్ట్రంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మంది మార్బలంతో సందడిగా నామపత్రాలు సమర్పించారు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కోలాహలంగా సాగింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్​కు శుక్రవారం చివరి రోజు కావడంతో వైకాపా, తేదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు మున్సిపల్ 27వ వార్డు ఉప ఎన్నికకు మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కౌన్సిలర్ అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలతో కార్యాలయం సందడిగా మారింది. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్లు సందడిగా సాగాయి. నామినేషన్ల ఆఖరి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుచరగణంతో భారీ ఉరేగింపులు నిర్వహించిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, తెదేపా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఆర్వో కార్యాలయాలకు వచ్చారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి డివిజన్​లో వివిధ పార్టీల ర్యాలీలు ఊరేగింపులతో కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మంది మార్బలంతో నామినేషన్లు దాఖలు చేశారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలకు ఆఖరి రోజున అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరుపున పోటీ చేస్తున్న 20 మంది వార్డు కౌన్సిలర్​లు తేదేపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైకాపా అభ్యర్థులు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నామినేషన్లు దాఖలు చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ 6వ డివిజన్​లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు నామపత్రాలు సమర్పించారు. అభ్యర్ధులు భారీ ర్యాలీగా తమ కార్యాలయాల నుంచి బయలుదేరి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. తెదేపా అభ్యర్థిగా పోతురాజు సమతా నామినేషన్ దాఖలు చేశారు. భాజపా నుంచి జితేంద్ర గుప్తా, వైకాపా అభ్యర్థిగా ఆత్మకూరి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ సుభాని, వైకాపా రెబల్ అభ్యర్థి సలీం బేగ్ నామినేషన్ వేశారు. నామినేషన్ కేంద్రాలకు 100మీటర్ల దూరంలో తమ వెంట వచ్చిన అనుచరులను పోలీసులు ఆపేశారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలకు అనుమతి ఇచ్చారు.

కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలకు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా ఛైర్మన్ అభ్యర్థిగా చెల్లిమిరెడ్డిని మంత్రి బుగ్గన ప్రకటించారు. నగర పంచాయతీలోని 20 వార్డులకు వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 1వ వార్డు ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. మొత్తం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా తరపున ముచ్చు లయ యాదవ్, తెదేపా అభ్యర్థిగా మురగడాపు పార్వతి, కాంగ్రెస్ పార్టీ తరఫున నూర్జహాన్ బేగం, భాజపా అభ్యర్థిగా లలితా దేవి హిరావత్ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి వివిధ పార్టీల అభ్యర్థులు చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 20 వార్డులకు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో... తెదేపా నాయకుల నామినేషన్ పత్రాలను వైకాపా శ్రేణులు చించివేశారు. నామినేషన్ల చివరి రోజైన నేడు... కుప్పం 14వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఎంపీపీ వెంకటేశ్​పై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం నామినేషన్ పత్రాలను లాక్కొని చింపివేశారు. సమాచారం అందుకున్న మాజీమంత్రి అమర్​నాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని గాయపడ్డ వెంకటేష్ ను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

TDP leaders : 'కుప్పం ప్రత్యేక అధికారి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారు'

Last Updated : Nov 6, 2021, 7:15 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.