ETV Bharat / city

రైల్వేస్టేషన్లలో.. మహిళలకు రక్షణేది? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

No Security: రాష్ట్రంలోని రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. గత 19 రోజులు వ్యవధిలో ఏపీలోని రైల్వేస్టేషన్‌ ప్రాంగణాల్లో జరిగిన 2 సామూహిక అత్యాచార ఘటనలు ప్రభుత్వ, రైల్వే పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. ప్లాట్‌ఫామ్‌పై నిరంతర గస్తీ లేకపోవటం, స్టేషన్‌ ప్రాంగణంలో తిరిగే పాత నేరగాళ్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కొరవడి వరుస నేరాలు జరుగుతున్నాయి.

no security for womens
రైల్వేస్టేషన్లలో.. మహిళలకు రక్షణేది?
author img

By

Published : May 5, 2022, 2:55 PM IST

No Security: రాష్ట్రంలో రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత లోపభూయిష్టంగా మారింది .ఏప్రిల్‌ 15న గురజాల హాల్ట్‌ రైల్వేస్టేషన్‌లో ఒడిశాకు చెందిన వలస కూలీపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే.. తాజాగా రేపల్లె రైల్వేస్టేషన్‌లో భర్త, పిల్లలతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్న వివాహితపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఆయా స్టేషన్లలో ఏ మాత్రం రైల్వే పోలీసుల గస్తీ, నిఘా ఉన్నా.. ఈ ఉదంతాల్ని నియంత్రించేందుకు వీలుండేది. జీఆర్‌పీ విభాగానికి సంబంధించి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి, క్షేత్రస్థాయి సిబ్బందిలో ఉదాసీనత, సరిపడా సిబ్బంది లేకపోవటం వంటివి రైలు ప్రయాణికుల్లో అభద్రతకు, ఆందోళనకు కారణమవుతున్నాయి.

రైల్వేస్టేషన్లలో.. మహిళలకు రక్షణేది?

రేపల్లె రైల్వేస్టేషన్‌లో జీఆర్‌పీ అవుట్‌పోస్ట్‌ ఉంది. నిబంధనల ప్రకారమైతే 24 గంటల పాటు అక్కడ భద్రత సిబ్బంది ఉండాలి. రాత్రి వేళలోనూ స్టేషన్‌లో గస్తీ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది . అనుమానస్పద వ్యక్తులు, పాత నేరగాళ్ల కదలికలు గుర్తించాలి. ప్రయాణికుల్ని ఎవరైనా ఇబ్బంది పెడతున్నారా? అనేది గమనించాలి. అలాంటి పరిస్థితి ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. కానీ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదీ రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ముగ్గురు వ్యక్తులు వివాహితపై ఆమె భర్త, పిల్లల ఎదురుగానే సామూహిక అత్యాచారానికి పాల్పడుతుంటే ఆ దుశ్చర్యను ఆపేందుకు ఒక్క రైల్వే పోలీసు కూడా ఆ సమయంలో అక్కడ లేక పోవటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది . అవుట్‌పోస్టులో ఉండాల్సిన సిబ్బంది ఏమయ్యారో కూడా తెలియదు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విధుల్లో ఉన్నప్పటికీ, వారి కార్యాలయానికి లోపల నుంచి తాళం వేసేసి పడుకున్నారు. బాధితురాలి భర్త వారి సాయం కోరుతూ ఎన్నిసార్లు తలుపు కొట్టినా ఎవరూ రాలేదు. దీంతో రాత్రి వేళ... పిల్లల్ని ఎత్తుకుని బాధితురాలి భర్త 200 మీటర్ల దూరంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. వారు అక్కడికి చేరుకునేలోపు ఆమె చిత్రహింసలకు గురయ్యారు. స్టేషన్‌లో పోలీసు గస్తీ ఉండుంటే.. ఆ అఘాయిత్యాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉండేదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ఒడిశాకు చెందిన వలస కూలీ మహిళ ఒకరు తన మూడేళ్ల బాలుడితో కలిసి గత నెల 15న రాత్రి 9 గంటల సమయంలో గురజాల హాల్ట్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెతో మాట్లాడుతూ అన్నం పెడతామంటూ ఆశ చూపించి స్టేషన్‌ శివారుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై అపస్మారక స్థితిలో రైల్వేస్టేషన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ పక్కన పడి ఉన్న ఆమెను 16వ తేదీ ఉదయం ప్రయాణికులు గుర్తించారు. అప్పటివరకూ పోలీసులు ఆమెను చూడనేలేదు. పోలీసుల గస్తీ లేమి వల్లే ఈ దారుణం జరిగిందనేది అర్ధమవుతుంది.

కొంచెం రద్దీ తక్కువగా ఉండే రైల్వేస్టేషన్‌లలో గస్తీని రైల్వే పోలీసులు గాలికొదిలేశారు. సిబ్బంది కొరతను కారణంగా పేర్కొంటూ ఓ మాదిరి పట్టణాల్లోని రైల్వేస్టేషన్‌ల్లో భద్రతను పట్టించుకోవట్లేదు. దీంతో రాత్రి వేళల్లో ఆయా రైల్వేస్టేషన్‌లో వేచి ఉండాలంటనే భయపడే పరిస్థితితో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే చాలా మంది ప్రయాణికులు వేకువజామున ఉండే రైళ్ల కోసం ముందు రోజు రాత్రే స్టేషన్‌కు చేరుకుని నిరీక్షిస్తుంటారు. పోలీసుల గస్తీ ఉంటుందనే భరోసాతో ఉండేది . తాజా ఘటనల నేపథ్యంలో అలాంటి ధీమా వారిలో పోయింది. రేపల్లెలో జీఆర్‌పీ అవుట్‌ పోస్టు ఉన్న చోటే రాత్రి సమయాల్లో స్టేషన్‌లో గస్తీ లేదంటే... అసలు అవుట్‌పోస్టులు లేని రైల్వేస్టేషన్‌లలో పరిస్థితి ఇంక దారుణంగా ఉంటోందనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే పరిరక్షణ దళం, సివిల్‌ పోలీసులతో జీఆర్‌పీకి సరైన సమన్వయం లేకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

రైల్వే సిబ్బంది కొరతే నిఘాలోపానికి కారణమని తెలుస్తుంది . విజయవాడ రైల్వే ఎస్పీ, గుంతకల్లు రైల్వే ఎస్పీ పరిధిలో దాదాపు 600 మందికి పైగా పోలీసు సిబ్బంది కొరత ఉంది. చాలా అవుట్‌ పోస్టుల్లో రాత్రి వేళల్లో ఒక్కరు కూడా విధుల్లో ఉండని పరిస్థితి నెలకొంది. విజయవాడ రైల్వే ఎస్పీ పరిధిలోని 15 అవుట్‌పోస్టుల్లో చాలా చోట్ల ఒకరిద్దరుతోనే నెట్టుకొస్తున్నారు. జీఆర్‌పీలో పనిచేసే కానిస్టేబుళ్లు కచ్చితంగా ప్లాట్‌ఫామ్‌ డ్యూటీలు చేయాలి. అయితే కొన్ని స్టేషన్లలో అసలు రాత్రిపూట ప్లాట్‌ఫామ్‌ డ్యూటీలనే వేయట్లేదు. వేసిన చోట కూడా కొంత మంది సిబ్బంది కొద్దిసేపు ఉండి.. అర్ధరాత్రి తర్వాత అక్కడే ఏదో గదిలో విశ్రాంతికి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలున్నాయి.

జీఆర్‌పీలోకి డిప్యూటేషన్‌పై సిబ్బంది వస్తుంటారు. సాధారణంగా ప్రతి రెండు, మూడేళ్లకోసారి ఈ సిబ్బంది మారుతుంటారు. అయితే కొంత మంది ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు కొన్నేళ్లుగా ఈ విభాగంలో పాతుకుపోయారు. వారిలో కొంతమంది విధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతంలో రైల్వే పోలీసు విభాగానికి సంబంధించి తరచూ సమీక్షలు జరిగేవి. ఉన్నతాధికారులు సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించేవారు. ఇప్పుడు ఆ సమీక్షలు కరువయ్యాయి. క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లో ఉంటున్నారా? సక్రమంగా గస్తీ నిర్వహిస్తున్నారా? అనే దానిపై అధికారులు తనిఖీలు నిర్వహించేవారు. అవి ఇప్పుడూ సక్రమంగా జరగట్లేదని తెలుస్తుంది . సాధారణంగా ఏటా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో రైళ్లల్లో బీట్లు, గస్తీ కోసం జీఆర్‌పీ సిబ్బందికి సాయంగా ఉండేందుకు ఆయా జిల్లా పోలీసు యూనిట్ల నుంచి సిబ్బందిని కేటాయిస్తారు. ఈ సారి మే నెల వచ్చినా ఇప్పటికీ సిబ్బంది రాకపోవటం కొరతకు నిదర్శనం.

ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.