కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు నో మాస్క్ నో ఎంట్రీ పేరుతో క్యాంపెయిన్ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడో దశ కరోనా వ్యాప్తి హెచ్చరికలతో జిల్లా వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు కోవిడ్ చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 100 పడకలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
వీటితో పాటు.... ఆక్సిజన్ సరఫరా , వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.ఇప్పటికే వాలింటర్ల సహయంతో ఫీవర్ సర్వే చేస్తున్నామని.. ఎక్కడ వ్యాప్తి ఎక్కువగా ఉందో గుర్తించి.. వైరస్ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరవనుండటంతో ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: