ETV Bharat / city

గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు ప్రభుత్వం చేసిందేమీ లేదు: చినరాజప్ప - వైకాపా ప్రభుత్వంపై చినరాజప్ప విమర్శలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. మాటలు చెప్పడం తప్ప ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని ఎధ్దేవా చేశారు. సీఎం జగన్ చెప్పే మాటలకు, చేసే పనులను ఏమాత్రం పొంతన లేదని మండిపడ్డారు.

nimmakyala chinarajappa
నిమ్మకాయల చినరాజప్ప
author img

By

Published : Oct 29, 2020, 1:56 PM IST

రైతులను ఆదుకుంటామని గొప్పలు పోతున్న ప్రభుత్వం వారికి చేసేది శూన్యమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ముఖ్యమంత్రికి.. రైతులకు ఏదో చేసేస్తున్నట్లు మంత్రులంతా డప్పు కొడుతున్నారని దుయ్యబట్టారు. 'మాట మార్చను మడమ తిప్పను' అని పదేపదే చెప్పుకునే సీఎం మాటలకు, చేసే పనులకు పొంతన లేదనడానికి రాజధాని మార్పు అంశమే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. రైతుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా.. బేడీలు వేసిన ఘటనను కన్నబాబు ఖండించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచార

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.