రాష్ట్రంలో కొత్తగా 232 కరోనా కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,082కు చేరింది. వైరస్ మృతుల సంఖ్య 7,115 కు పెరిగింది.
రాష్ట్రంలో కరోనా నుంచి 352 మంది కోలుకోగా... ఇప్పటివరకు 8.72 లక్షల మందికి పైగా బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,070 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీచదవండి.