రాష్ట్రంలో గత 24 గంటల్లో 42,911 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 282 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కోటీ 15 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
8,80,712 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8.69 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా..7,092 మంది మృతి చెందారని వివరించింది. ఇప్పటికీ.. 3,700 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: