గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 96,121 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,147 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీటితో పాటు 38 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 5,773 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 46,126 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొవిడ్ కారణంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 838, పశ్చిమగోదావరి జిల్లాలో 571, చిత్తూరు జిల్లాలో 569 కరోనా కేసులు వెలుగు చూశాయి.
ఇదీచదవండి.