కరోనా వ్యాప్తి నిరోధక కార్యక్రమాలకు హాజరు కాని వాలంటీర్ల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 50, 100 కుటుంబాలకు ఒకరు చొప్పున పట్టణ ప్రాంతాల్లో 70,888 మంది వార్డు వాలంటీర్లను నియమించారు. కొవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కుటుంబ సర్వే, విదేశాలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించే బాధ్యతను వారికి పురపాలక శాఖ అప్పగించింది. పలు జిల్లాల్లో వాలంటీర్లు విధులకు గైర్హాజరవడం, మరికొందరు సెలవులు పెట్టడం వంటివి జరిగాయి. అలాంటివారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని పురపాలక కమిషనర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
విధులకు హాజరు కాని వాలంటీర్ల స్థానంలో కొత్త నియామకాలు
కరోనా వ్యాప్తి నిరోధక కార్యక్రమాలకు హాజరు కాని వాలంటీర్ల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. పలు జిల్లాల్లో వాలంటీర్లు విధులకు గైర్హాజరవగా.... మరికొందరు సెలవులు పెట్టారు. అలాంటివారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని పురపాలక కమిషనర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కరోనా వ్యాప్తి నిరోధక కార్యక్రమాలకు హాజరు కాని వాలంటీర్ల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 50, 100 కుటుంబాలకు ఒకరు చొప్పున పట్టణ ప్రాంతాల్లో 70,888 మంది వార్డు వాలంటీర్లను నియమించారు. కొవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కుటుంబ సర్వే, విదేశాలకు వెళ్లొచ్చిన వారిని గుర్తించే బాధ్యతను వారికి పురపాలక శాఖ అప్పగించింది. పలు జిల్లాల్లో వాలంటీర్లు విధులకు గైర్హాజరవడం, మరికొందరు సెలవులు పెట్టడం వంటివి జరిగాయి. అలాంటివారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని పురపాలక కమిషనర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదీ చూడండి:ఇంటికి రాని వాలంటీర్లు... గడప దాటిన ప్రజలు