రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల వ్యవధిలో 26,844 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 70 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 8,88,555కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
వైరస్ బారినుంచి 115 మంది కోలుకోగా.. మొత్తం కొలుకున్నవారి సంఖ్య 8,88,0478గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌తో 7,160 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 1,33,94,460 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 9,110 మందికి వైరస్