నీట్ రాష్ట్ర ర్యాంకర్ల జాబితా ఈ నెల 16న ప్రకటించనున్నట్లు(neet state rankers list released on november 16th) ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శ్యాంప్రసాద్(vc shyam prasad) తెలిపారు. 2020-21లో మాదిరిగానే కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తామని.. ఫీజుల్లో ఎలాంటి మార్పుల్లేవని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ నీట్(mbbs neet results) ఫలితాలు ఈ నెల 2న వచ్చాయి. రాష్ట్రంలోని 30 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 1,986 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లో ‘ఏ’ కేటగిరీలో 1,325, ‘బీ’ కేటగిరీలో 921, ‘సీ’ కేటగిరీలో 427 సీట్లు ఉన్నాయి. ఇవికాక ప్రభుత్వ కళాశాలల్లోని 351 సీట్లను జాతీయ కోటా కింద ఇవ్వనున్నారు. ఇందులో మిగిలే సీట్లను విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తుంది.
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ, ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో 1,440 డెంటల్ సీట్లు(DENTAL) ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 119 సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లో ‘ఏ’ కేటగిరీలో 650, ‘బీ’ కేటగిరీలో 454, ‘సీ’ కేటగిరీలో 196 సీట్లు ఉన్నాయి. ఇవీకాక ప్రభుత్వ కళాశాలల్లోని 21 సీట్లను జాతీయ కోటా కింద కేటాయించనున్నారు. ఇందులో మిగిలితే వర్సిటీనే భర్తీ చేస్తుంది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 943, ప్రైవేటు కళాశాలల్లో 1,201 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్ సమయానికి కళాశాలల్లో కలిపి అదనంగా మరో 50 సీట్లు రావొచ్చని భావిస్తున్నారు. పీజీ వైద్య విద్య( PG IN MEDICINE)లో సీట్ల(neet state rankers list) భర్తీ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉంది. కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగియబోతుంది. జాతీయ కోటాలో సీట్ల భర్తీ అనంతరం విశ్వవిద్యాలయం తొలి కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. దీనికి ఇంకాస్త సమయం పట్టనుంది. ఈ సీట్ల భర్తీకి అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియను విశ్వవిద్యాలయం(NTR UNIVERSITY OF HEALTH) చేపడుతుంది.
ఇదీ చదవండి..