ETV Bharat / city

నీట్‌లో తీవ్ర పోటీ...మారుతున్న ర్యాంకులు ! - నీట్ ర్యాంకులు

లాక్‌డౌన్‌ కారణంగా సన్నద్ధతకు ఎక్కువ సమయం దొరకడం నీట్ ఫలితాల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడినట్లు విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కుల సాధనలో ఈ ఏడాది విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ కనిపించింది.

నీట్‌లో తీవ్ర పోటీ...మారుతున్న ర్యాంకులు

author img

By

Published : Oct 18, 2020, 6:05 AM IST

నీట్‌ ఫలితాల్లో కొత్త ధోరణి కనిపించింది. మార్కుల సాధనలో విద్యార్థుల మధ్య తీవ్ర పోటీ కనిపించింది. ఈసారి ఒకే మార్కు ఎక్కువమందికి వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా సన్నద్ధతకు ఎక్కువ సమయం దొరకడం విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడినట్లు విద్యారంగ నిపుణులు శంకరరావు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎయిమ్స్‌, జిప్‌మర్‌లో ప్రవేశాలు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వారలా చేరడం వల్ల.. తరువాత స్థానాల్లో ర్యాంకర్లకు తామనుకున్న రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఏర్పడిందని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్యాంప్రసాద్‌ తెలిపారు. నీట్‌ ఫలితాలపై విశ్లేషకుల అంచనా ప్రకారం...

  • 2019లో అత్యధిక మార్కు 701. జనరల్‌ కేటగిరీలో అర్హత మార్కు 134. 2020లో అత్యధిక మార్కు 720. జనరల్‌ కేటగిరీలో అర్హత మార్కు 147.
  • 2019 నీట్‌లో 720కు గాను 500 మార్కులు సాధించిన విద్యార్థులు సుమారు 100 మంది ఉన్నారు. 2020లో 700 పైగా మార్కులు సాధించిన వారే 100 మంది వరకు ఉంటారని భావిస్తున్నారు.

వైద్య కళాశాలల్లో సీట్లు ఇలా..

నీట్‌ ఫలితాలు శుక్రవారం వెల్లడైనందున రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, వాటిలో ఉన్న సీట్లపై విద్యార్థులు దృష్టి చూపుతున్నారు. ఆయా వైద్య కళాశాలల్లోని సీట్ల వివరాలివి..

  • 2019-20లో రాష్ట్రంలో ఏయూ రీజియన్‌ - జనరల్‌ కేటగిరీలో 38,364, మహిళా కేటగిరిలో 37,275 ర్యాంకు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఎస్వీయూ రీజినల్‌ జనరల్‌ కేటగిరిలో 44,866, మహిళా కేటగిరిలో 43,410 ర్యాంకు సాధించిన వారికి సీట్లు దక్కాయి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు.

ఇదీచదవండి

ఏపీ సీఎంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించాలి: ఏఐబీఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.