ETV Bharat / city

ప్రకృతికి స్వచ్ఛతనందిస్తున్న లాక్​డౌన్​

ప్రజలను ఇంటికే కట్టిపడేసిన కరోనా కట్టడి చర్యలు ప్రకృతికి పూర్వ వైభవాన్నిస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమలుతో వాహనాల రాకపోకలు, పరిశ్రమల కార్యకలాపాలు తగ్గటంతో వాయు నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. రోజులో ఏదో ఒక దగ్గర ప్రమాదాలు జరిగే రహదారులు ప్రశాంతంగా మారాయి. వాతావరణంలో కాలుష్యం తగ్గినందున సాయంకాలానికి వేడి తీవ్రత తగ్గుముఖం పడుతోంది.

author img

By

Published : Apr 8, 2020, 6:31 AM IST

Updated : Apr 8, 2020, 9:59 AM IST

natural advantages to lock down
ప్రకృతికి స్వచ్ఛతనందిస్తున్న లాక్​డౌన్​
ప్రకృతికి స్వచ్ఛతనందిస్తున్న లాక్​డౌన్​

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో జనసంచారం బాగా తగ్గిపోయింది. గతంలో వాహనాలతో కిక్కిరిసే రోడ్లు ఇప్పుడు బోసిపోయాయి. పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున విడుదలయ్యే వ్యర్థాలు తగ్గాయి. దీని వల్ల కాలుష్యస్థాయి బాగా తగ్గి పర్యావరణం మెరుగుపడింది. వాయు నాణ్యతను పరీక్షించే కాలుష్య నియంత్రణ మండలి 51 నుంచి వంద మధ్యలో ఉంటే సంతృప్తికరమని చెబుతోంది. ఇదే సంఖ్య 50కి దిగువలో ఉంటే ఉత్తమంగా ఉన్నట్టు తేల్చింది. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయునాణ్యత సంతృప్తికరంగా ఉంటే ఇప్పుడది ఉత్తమ స్థాయికి చేరింది. లాక్‌డౌన్‌ కారణంగా పర్యావరణానికి ఊహించని స్థాయిలో మేలు జరుగుతోందని నిపుణులు ఆనందిస్తున్నారు.

వాతావరణంలో వచ్చిన ఈ ఆహ్లాదకర మార్పును మూగజీవాలూ అమితంగా ఆస్వాదిస్తున్నాయి. తిరుమల ఘాట్‌రోడ్‌ మూసివేయడంతో లేళ్లు, దుప్పిలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆకాశానికేసి చూస్తే కాలుష్య మేఘాలు కనిపించే పట్టణాల్లోనూ సాయం సంధ్యలో పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తున్నాయి. విమాన రాకపోకలూ నిలిచిపోవడంతో గుంపులుగా గాల్లో విహరిస్తున్నాయి.

ఇదీ చూడండి రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం.. 3 రోజులు మోస్తరు వర్షం

Last Updated : Apr 8, 2020, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.