రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ (National SC Commission) అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మత మార్పిడులపై నివేదిక ఇవ్వటంలో జాప్యం చేయటాన్ని తప్పుబట్టింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్‌కు (AP CS) ఆదేశాలు జారీ చేసింది.
ఏం జరిగిందంటే..
రాష్ట్రంలో పెద్దఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని ఎస్సీ కమిషన్‌కు కొందరు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కమిషన్.. ఈ అంశంపై నివేదిక (Report) ఇవ్వాలని జూన్‌లో అప్పటి సీఎస్‌కు లేఖ (Letter To AP CS) రాసింది. ఎస్సీ కమిషన్ లేఖపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ప్రభుత్వంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎస్‌కు మరోసారి లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్...వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి
Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే