కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్పై పన్నుల బాదుడు తగ్గించేదేమైనా ఉందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు(nara lokesh on petrol taxes). రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందిపడుతున్న సామాన్య జనానికి ఉపశమనం కలిగించేలా లీటర్ పెట్రోల్‍పై రూ. 5, డీజిల్‍పై రూ. 10 కేంద్ర ప్రభుత్వం తగ్గించడం సంతోషకరమైన విషయమని లోకేశ్ అన్నారు.
'రాష్ట్రంలో వసూల్ రెడ్డి.. పెట్రోల్, డీజిల్‌పై దేశంలో ఎక్కడాలేని విధంగా 31 శాతం వ్యాట్‌కి అదనంగా వివిధ రకాల సుంకం వేసి లీటర్ పెట్రోల్‍పై పన్నుల రూపంలో రూ.30 బాదుతున్నారు' అని లోకేశ్ ధ్వజమెత్తారు. కేంద్రం తగ్గించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుంకాలను పెంచి మళ్లీ జనంపై బాదుతారేమోనని ఎద్దేవా(nara lokesh comments on cm jagan) చేశారు.
ఇదీ చదవండి..
Amaravathi farmers: నాలుగో రోజు.. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర