జగన్ రెడ్డి వైకాపా నిరుద్యోగులకు పట్టం కట్టి, నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జగన్‌రెడ్డికి గుర్తురావడం లేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా పర్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు రమేశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థోమత లేకపోయినా రెక్కల కష్టంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివిస్తే.. టీటీసీ పూర్తి చేసినా ఉద్యోగం లేకపోవడం, మరోపక్క అప్పుల బాధ తట్టుకోలేక రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రమేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఆత్మహత్యలు నివారించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
-
వైకాపా నిరుద్యోగులకు పట్టం కట్టిన @ysjagan గారు నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తురావడం లేదు.(1/3) pic.twitter.com/jpknedkzfa
— Lokesh Nara (@naralokesh) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైకాపా నిరుద్యోగులకు పట్టం కట్టిన @ysjagan గారు నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తురావడం లేదు.(1/3) pic.twitter.com/jpknedkzfa
— Lokesh Nara (@naralokesh) July 22, 2021వైకాపా నిరుద్యోగులకు పట్టం కట్టిన @ysjagan గారు నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తురావడం లేదు.(1/3) pic.twitter.com/jpknedkzfa
— Lokesh Nara (@naralokesh) July 22, 2021
ఇదీ చదవండి:
Inter results: రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!