న్యాయబద్ధంగా తమకు రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కార్మికులు నిరసన తెలపడం రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమా.. అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. మున్సిపల్ కార్మికులను అరెస్టు చేసి జైలుకి పంపడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్‌లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు.
జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు మున్సిపల్ కార్మికులవన్న లోకేశ్.... అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా? అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. నాలుగు రోజులు రిలే నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోకపోగా, కనీసం వారి సమస్య గురించి వినడానికి కూడా ఉన్నతాధికారులకు మనస్సు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించటంతో పాటు అరెస్టు చేసిన కార్మికులను తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్వీట్‌కు జత చేశారు.
-
మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం @ysjagan మూర్ఖత్వానికి పరాకాష్ట. దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య. జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు వారివి. అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా?(1/3) pic.twitter.com/xFQtbzbBmw
— Lokesh Nara (@naralokesh) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం @ysjagan మూర్ఖత్వానికి పరాకాష్ట. దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య. జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు వారివి. అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా?(1/3) pic.twitter.com/xFQtbzbBmw
— Lokesh Nara (@naralokesh) August 2, 2021మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం @ysjagan మూర్ఖత్వానికి పరాకాష్ట. దొంగల్ని పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించడం వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్య. జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలు వారివి. అలాంటిది ఐదు నెలల జీతం రాకపోతే కడుపు మండదా?(1/3) pic.twitter.com/xFQtbzbBmw
— Lokesh Nara (@naralokesh) August 2, 2021
ఇదీ చదవండి