సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. "గన్ రాకముందే జగన్ వస్తాడు" అని గాలి కబుర్లు చెప్పారని దుయ్యబట్టారు. "ఇప్పుడు రివర్స్ లో జగన్ రెడ్డి కంటే ముందు.. ఆయన పెంచిపోషిస్తోన్న ఇసుక మాఫియా గన్‌లతో వచ్చి తూర్పుగోదావరి జిల్లా, లంకల గన్నవరంలో రెచ్చిపోయింది" అని ఆక్షేపించారు.
భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి, ఇసుకని బంగారం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గన్నులు పట్టుకొని వైకాపా ఇసుకాసురులు ప్రజలపై పడ్డారని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగించి, ప్రజల ప్రాణాలు తీస్తారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: