రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసం, రథాలకు నిప్పు వంటి ఘటనలు జరుగుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పూజారులపై దాడులు, ఆలయ భూముల అమ్మకం వంటి ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు.
రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల వెనక ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరో బయటపడాలన్నారు. వరుస ఘటనలకు కారణమైన వారు ఎంత పెద్ద వారైనా కఠినంగా శిక్షించాలని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: