సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలు చెప్పి.. అవాస్తవ కథనాలతో విషప్రచారం కొనసాగించాలనుకుని బొక్కబోర్లా పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అధికారంలోకొచ్చే వరకూ అసత్య ప్రచారమే ఆయుధంగా తన మీడియా సంస్థల్ని జగన్‌రెడ్డి వాడుకున్నారన్నారు. చివరికి ఏప్రిల్ ఫూల్ వార్తలు రాయించుకునే స్థాయికి దిగజారిపోయారని దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో ఏప్రిల్ ఫూల్ కథనం ప్రచురించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తప్పుడు వార్తలు సరికాదని ఆయన హితవు పలికారు. పాత్రికేయ విలువల్ని మంటగలపడమేనని అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఇదీ చదవండి: