సర్పంచుల హక్కులు కాలరాసే విధంగా.. ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సర్పంచులకు కట్టబెట్టిన అధికారాలను ఒక్క జీవోతో సీఎం జగన్ మింగేశారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తల పెత్తనం కోసం సర్పంచులను డమ్మీలను చేసే విధంగా వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ధ్వజమెత్తారు.
గ్రామ సచివాలయాలకు సర్పంచులను దూరం చేయడం అన్యాయమని, ముఖ్యమంత్రి అయ్యాక నియంతకంటే ఘోరంగా రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య పద్ధతుల పైనా జగన్ దాడులకు పాల్పడుతున్నారని లోకేశ్ ఆరోపించారు.
ఇదీ చదవండి:
కొవిడ్‌ను తరిమికొట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదు: సీఎం