జడ్జి రామకృష్ణ విషయంలో ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆయనకు ప్రాణహాని ఉందని కుమారుడు వంశీ హైకోర్టుకు రాసిన లేఖ నిజమేననిపిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రామకృష్ణ ఉన్న బ్యారెక్ లో అపరిచిత వ్యక్తిని ఎందుకు ఉంచారని నిలదీశారు. రామకృష్ణను అంతమొందించడానికే అపరిచిత వ్యక్తిని అక్కడ ఉంచారని అందరూ అనుకుంటున్నారని.. ఈ వ్యవహారంపై హైకోర్టు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు.
రామకృష్ణ కుమారుడి లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకొని తక్షణమే స్పందించాలన్నారు. నాగార్జున రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని ఆనందబాబు తెలిపారు. రామకృష్ణపై కూడా ఎంపీ రఘురామపై పెట్టినట్టు రాజద్రోహం కేసులు పెట్టడంపై మండిపడ్డారు.
ఇవీ చదవండి:
Disaster: 'పాఠ్యాంశంగా విపత్తు, మహమ్మారి నిర్వహణ'
Raghurama Letter to KCR: తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ