వైకాపా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల భాషలో ఫ్యాక్షన్ మనస్తత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. లోకేశ్ తన పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి, వారికి భరోసా, ధైర్యం కల్పించడానికి మాట్లాడితే..వైకాపా నేతలకు ఎందుకంత ఉలికిపాటని నిలదీశారు. "ఎందుకూ పనికిరాని వాళ్లంతా లోకేశ్‌పై విమర్శలు చేయటం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు" అని ఆక్షేపించారు.
లోకేశ్ అన్నట్లుగా తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా రౌడీమూకల పనిపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ క్యాలండర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లిందని దుయ్యబట్టారు. పది వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌కు కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో ప్రకటనలిస్తారా ? అని మండిపడ్డారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పడం ముమ్మాటికీ యువతను మోసగించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి
RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ