ETV Bharat / city

Nakka Anand Babu: లెక్చరర్ జకరయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu On Lecturer jakaraiah suicide Incident: గుంటూరు జిల్లా తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన లెక్చరర్ జకరయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఎయిడెడ్​పై ప్రభుత్వ విధానమే జకరయ్యను పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు.

నక్కా ఆనంద్ బాబు
నక్కా ఆనంద్ బాబు
author img

By

Published : Jan 7, 2022, 10:34 PM IST

Nakka Anand Babu On Lecturer jakaraiah suicide Incident: ప్రభుత్వం వ్యవస్థలను ఎంతగా నాశనం చేసిందో చెప్పటానికి దళిత లెక్చరర్ జకరయ్య ఆత్మహత్యే నిదర్శనమని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన లెక్చరర్ జకరయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. ఎయిడెడ్​పై ప్రభుత్వ విధానమే జకరయ్యను పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో ఎయిడెడ్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు.

సీఎం జగన్ చర్యలతో ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కాలేజీలలోని దాదాపు 2 వేల మంది లెక్చరర్లు, పాఠశాలలోని 7 వేల మంది టీచర్లు రోడ్డున పడతారని ఆనాడే హెచ్చరించామన్నారు. దళిత లెక్చరర్ జకరయ్య సూసైడ్ నోటును పోలీసులు తారుమారు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చెబుతున్నట్లు అతను అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటే నోటును వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..

గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో జకరయ్య అనే వ్యక్తి ఈనెల 6న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు స్థానిక అంబేద్కర్ ఎయిడెడ్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన అనేక అప్పులు చేశారు. అయితే.. వడ్డీలు కడుతూ బాకీలు చెల్లిస్తున్నా.. అప్పులు తీరలేదు. అప్పులు ఇచ్చినవాళ్లు.. పదే పదే ఇబ్బందులు పెట్టడంతోపాటు అతనిపై కేసులు కూడా పెట్టారు. దీంతో కోర్టు వాయిదాలకూ తిరుగుతున్నారు. ఈ ఇబ్బందులు తాళలేని జకరయ్య.. ఆత్మహత్య చేసుకోవడమై పరిష్కారంగా భావించాడు. ఈ క్రమంలో.. మార్నింగ్ వాక్ పేరుతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ఒకటో పట్టణ సీఐ కొమ్మలపాటి చంద్రశేఖర్ తెలిపారు.

ఇదీ చదవండి

కోర్టు సమీపంలోనే.. పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.