శాంతియుతంగా చేపట్టే శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రహదారుల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 27నే డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం గురించి తెలిపామని చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా సమాచారమిచ్చినట్లు తెలిపారు. పార్టీ తలపెట్టిన శ్రమదానంలో కార్యక్రమంలో జనసైనికులను పాల్గొనకుండా పోలీసులు నిర్బంధిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
ఇదీ చదవండి:
పవన్ పర్యటనపై ఉత్కంఠ.. శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ నోటీసులు