పదో తరగతికి ముందు ఏడేళ్లపాటు ఏ జిల్లాలో చదివితే... ఆ జిల్లానే స్థానికత అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు దరఖాస్తు చేసుకునేవారంతా ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను.. ప్రస్తుతం నివాసం ఉంటున్న జిల్లాలో స్థానికేతరులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారంతా విధిగా గ్రామస్థాయిలోనే నివాసం ఉండాలని అధికారులు వెల్లడించారు. వచ్చేనెల 1, 8 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించే రాత పరీక్ష ఫలితాలను.. 15 రోజుల్లోనే అధికారులు వెల్లడించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటగిరి-1లోని ఉద్యోగాలకు పరీక్ష రాసేవారందరికీ తెలుగులోనే ప్రశ్నాపత్రం సిద్ధం చేస్తున్నారు. మిగిలిన కేటగిరిల్లోని ఉద్యోగాలకు ఆంగ్లభాషలో పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :