Muppala Nageswara rao fires on Govt: అగ్రిగోల్డ్ ఖాతాదారుల విషయంలో.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆగ్రిగోల్డ్ ఖాతాదారుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. బాధితులతో సమావేశమైన ఆయన.. తుది దశ పోరాటానికి కార్యాచరణ రూపొందించనున్నామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు.
వారం రోజుల్లో 14 లక్షల మందికి న్యాయం చేస్తామని, 6 మాసాల్లోగా సంపూర్ణంగా న్యాయం చేస్తామని.. సీఎం పాదయాత్రలో హామీ ఇచ్చారని.. ముప్పాళ్ల గుర్తుచేశారు. హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో.. మారుపేరుతో వ్యాపారాలు చేస్తున్నా.. ప్రభుత్వం ఒక్కరినీ కూడా అరెస్టులు చేయలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి:
నాడు ఎర్రన్న.. నేడు అచ్చెన్న.. నాకు అత్యంత ఆప్తులు: చంద్రబాబు