విజయవాడ నగరపాలక ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందని.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రచారం అనుమతుల మంజూరుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సింగిల్ విండో సెల్ ఏర్పాటు చేశారు. మొత్తం 64 డివిజన్లకు కలిపి ఒకటే సెల్ ఏర్పాటు చేయటాన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. మొత్తం 384 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అనుమతుల కోసం రోజూ కార్యాలయాలకి వస్తుంటే సకాలంలో మంజూరు కావట్లేదని వాపోతున్నారు. తమ తర్వాత అనుమతికి దరఖాస్తు చేసుకున్న అధికారపార్టీ అభ్యర్థులకు మాత్రం..ముందుగా మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. ప్రచార గడువు సమీస్తున్న తరుణంలో అనుమతి మంజూరులో జాప్యం ఎంత వరకు సబబని అభ్యర్థులు నిలదీస్తున్నారు.
ఇదీచదవండి 'ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్నారు'