రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 11వ పీఆర్సీ అమలు చేయాలని, పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కరువు భత్యం, 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు నేరవేర్చాలని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న ఆయన.. పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించాలన్నారు.పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగే ధరలతో చాలీ చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జీతాలు పెంచాలన్నారు.
ఇదీ చదవండి: