ETV Bharat / city

Muncipal workers protest: 'మమ్మల్ని పర్మినెంట్ చేయండి.. తక్షణమే డిమాండ్లు పరిష్కరించండి' - శ్రీకాకుళం జిల్లా ప్రధాన వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వర్తించే ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా వైకాపా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ధర్నా

author img

By

Published : Jul 15, 2021, 4:42 PM IST

విజయవాడలో..

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కాస్ విధానంతో మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు గల సంవత్సర కాలంగా అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగులకు వర్తించే ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా వైకాపా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

నెల్లూరు జిల్లాలో...

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో...

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్‌ వర్కర్స్‌ మరియు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థలు, నగర పంచాయితీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ ఆప్కాస్ నుంచి మినహాయించాలన్నారు. అలాగే కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలన్న వీరు.. సచివాలయాలకు బదలాయింపు ఆపాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న పారిశుధ్య కార్మికులు.. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

ఇదీ చదవండి:

దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.