విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 28 పాఠశాలలు.... పదోతరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 2 వేల 106 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.... 1,818 మంది ఉత్తీర్ణత సాధించారు. 87 శాతం సగటు ఉత్తీర్ణత నమోదైంది. సీవీఆర్ పాఠశాల, పటమటలోని జీడీఈటీ మున్సిపల్ స్కూల్, మాచవరంలోని టీఎమ్ఆర్సీ పాఠశాల, కృష్ణలంకలోని పీఎమ్ఆర్ పాఠశాలలకు చెందిన 25 మంది విద్యార్థులు.... పది జీపీఏ సాధించి ప్రతిభ చాటారు. 4 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి...... తల్లిదండ్రుల్లో భరోసా నింపుతున్నాయి.
నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో ఉత్తమప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి.... ఏకేపీటీఎమ్ పాఠశాలలో అధికారులు ప్రత్యేకశిక్షణ ఇప్పించారు. మొత్తం 70 విద్యార్థులు అడ్వాన్స్‌డ్ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందారు. 20 మంది పది GPA సాధించగా, 23 మంది 9.8 జీపీఏతో సత్తా చాటారు. సగటున 70 మంది విద్యార్థులు 9.67 గ్రేడ్ పాయింట్లు నమోదు చేశారు. గతేడాదితో పోలిస్తే పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గినా.... ఈ ఏడాది మరిన్ని జాగ్రత్తలు తీసుకుని.. పాయింట్లతో పాటు ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేస్తామని అధికారులు అంటున్నారు.