ETV Bharat / city

గుప్త నిధుల కోసమే తెలంగాణ సచివాలయం కూల్చివేత: రేవంత్​ - సచివాలయం కూల్చివేతపై రేవంత్​ రెడ్డి స్పందన

తెలంగాణ సచివాలయం జీ బ్లాక్‌ నుంచి బయటకు సొరంగ మార్గాలు ఉన్నాయని.. అందుకే వాటి కింద గుప్త నిధులు ఉంటాయనే అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్ పక్కనే మింట్ కాంపౌండ్ ఆరో నిజాం కాలంలో నాణేల ముద్రణ జరిగిందని ప్రచారం ఉందని.. జీ బ్లాక్‌నుంచి ఐదో నిజాం పరిపాలన చేశారని ఇంగ్లీషు పత్రికలు కథనాలు రాశాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

mp-revanth-reddy-criticise-cm-kcr-on-demolition-of-secretariat

author img

By

Published : Jul 18, 2020, 8:40 PM IST

గుప్త నిధుల కోసమే తెలంగాణ సచివాలయం కూలుస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయ కూల్చివేతకు కోర్టుల నుంచి అనుమతి రాగానే సీఎం ఫామ్ హౌజ్​కి వెళ్లారని ప్రచారం జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్​కి వెళ్ళారా? లేదంటే రహస్య ప్రదేశానికి వెళ్ళారా అనేది బ్రహ్మ రహస్యం! అని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్​పై గతంలోనే ఎన్​ఎండీసీ కేంద్ర సంస్థతో సర్వే జరిగిందన్నారు.

"సెక్రటేరియట్ పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్‌లో ఆరో నిజాం కాలంలో నాణేల ముద్రణ జరిగింది అని ప్రచారం. జీ-బ్లాక్ నుంచి ఐదో నిజాం పరిపాలన సాగించారని ఇంగ్లీషు పత్రికలు కథనాలు రాశాయి. జీ-బ్లాక్ నుంచి బయటకు సొరంగ మార్గాలు ఉన్నాయి. అందుకే వాటి కింద గుప్త నిధులు ఉంటాయనే అనుమానాలున్నాయి.

-రేవంత్​ రెడ్డి, తెలంగాణ ఎంపీ

వేల కోట్ల రూపాయల అక్రమాలు జరగడానికి అవకాశం ఉన్న శాఖలకు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే ఉంచారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్​లో మురళీధర్ రావు ఎలా ఉన్నారో- ఆర్కియాలజీ శాఖలో రఘునందన్ రావు ఉండటం వల్ల తమకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. మూడేళ్ళ కిందట అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్ కమిటీ వేస్తా అన్న కేసీఆర్ మూడేళ్లు గడుస్తున్నా కమిటీ వెయ్యలేదని మండిపడ్డారు. బీఆర్కే భవన్ ఉద్యోగులకు సైతం సెలవులు ఇచ్చి.. సెక్రటేరియట్ కూల్చాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వం చెప్పాలని రేవంత్​ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.