సీఎం జగన్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ, ఆయన సలహాదారుడు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు... అనుమానాస్పదం అంటూ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వ్యాఖ్యానించారని.. ఇప్పటికైనా లేఖ అంశంపై జగన్ క్షమాపణ చెబితే బాగుంటుందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలోని రచ్చబండ కార్యక్రమంలో అన్నారు.
2017-18 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రాజెక్ట్ వ్యయం రూ. 47 వేల కోట్లకు అనుమతి ఇవ్వగా... రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ఒప్పుకుందన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ రూ. 47 వేల కోట్లు విడుదల చేసేలా సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారన్నారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వ్యయం కేంద్రమే భరించాలని డిమాండ్ చేయడానికి ఏపీ ప్రభుత్వానికి హక్కు ఉందని వ్యాఖ్యానించారు.
మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదన్న ఆయన.. అనువంశిక చట్టాల ప్రకారం మన్సాస్ ట్రస్ట్ నియమాల ప్రకారం ఛైర్మన్ పదవిని చేపట్టడానికి సంచైత గజపతిరాజుకు అవకాశం లేదన్నారు. క్రైస్తవ మత వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ.. తనకు వ్యతిరేకంగా ఒక పత్రిక కథనాలు రాసిందన్న రఘురామరాజు.. హిందూవాదిగా నా మతాన్ని నేను ప్రేమిస్తున్నాను అని అన్నారు.
ఇదీ చూడండి: హై ఎండ్ స్కిల్డ్ వర్శిటీ పనులు త్వరగా పూర్తి చేయాలి: సీఎం