పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తును మార్చకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారమే కట్టి రాయలసీమకు నీరందించాలన్నారు. ఏపీ హైకోర్టు సాధన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన సహాయాన్ని సకాలంలో అందించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక వనరులను ఒకేసారి కాకున్నా... విడతల వారీగా తీసుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ప్రాముఖ్యత, సమస్యలపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నిస్తానని రఘురామ స్పష్టం చేశారు.
ఏపీ హక్కులను విభజన చట్టం ప్రకారంగా సాధించుకుందామని... ఆ దిశగా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరు ఏకం కావాలని ఏపీ హైకోర్టు సాధన పరిరక్షణ సమితి కన్వీనర్ డీఎస్ఎన్వీ ప్రసాద్ సూచించారు.
ఇదీచదవండి