ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో వైకాపా ఎంపీ మిధున్ రెడ్డి గళం విప్పారు. ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం కావున ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్‌కు బకాయిలు పడ్డ రూ. 17వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
2014 ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. దేశంలోనే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం కావున ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం మాట నిలబెట్టుకోవాలి. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు 2013-14 నుంచి ఇప్పటి వరకు రూ.1700 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. కావున వెంటనే వాటిని రియంబెర్స్ చేయాలి. అదే విధంగా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలి. - మిధున్ రెడ్డి, ఎంపీ
ఇదీ చదవండి: 'అమరావతిని అభివృద్ధి చేసేలా కేంద్ర సహకరించాలి'.. లోక్ సభలో ఎంపీ గల్లా