విజయవాడ కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరాలన్నదే తన ధ్యేయమని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. పార్టీ ఏది చెప్తే అది చేయటానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కుందన్నారు. తన వెంట ఉన్నదీ, తాను ఆత్మ బంధువులుగా భావించే బీసీలు, మైనార్టీలేనని వ్యాఖ్యానించారు. తనకు తెలియని బాధలు వారికి ఏమైనా ఉన్నాయేమోనని అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపులో తాను విభేదించింది కూడా బ్రాహ్మణ, బీసీ సీట్ల కోసమేనన్నారు. తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చేయొచ్చని నాని అన్నారు. చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇస్తే వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. తనను రాజీనామా చేయమని పార్టీ ఆదేశిస్తే ఈ క్షణమే చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: విజయవాడ తెదేపాలో భగ్గుమన్న విభేదాలు