కేంద్ర ప్రభుత్వం రేషన్ కోటా పంపించినా.. దాన్ని ప్రజలకు అందించకుండా.. ఆ నెపాన్ని ప్రధాని మోదీపై నెట్టడం దుర్మార్గమని భాజపా ఎంపీ జీవీఎల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ విషయంలో చేస్తున్న మోసాలపై భాజపా ఉద్యమిస్తుందని అన్నారు. ఈనెల 14న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామని చెప్సారు. పేదలకు బియ్యం ఎగ్గొట్టి ప్లీనరీల పేరుతో సంబరాలు చేసుకున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు.
వైకాపా ప్లీనరీలో పార్టీకి శాశ్వత అధ్యక్షున్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా అభివర్ణించిన జీవీఎల్.. ఒకే కుటుంబం నుంచి పార్టీని శాసించే విధానాన్నిఆపాలన్నారు. బటన్ నొక్కి నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకొంటున్నారని.. కానీ ఆ డబ్బులను మోదీయే పంపిస్తున్నారనే విషయాన్ని జగన్ ఎక్కడా చెప్పడం లేదని తెలిపారు.
ఇవీ చూడండి :