ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం - dasara ustavas 2020

విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు

author img

By

Published : Oct 21, 2020, 3:10 PM IST

Updated : Oct 22, 2020, 12:20 AM IST

15:07 October 21

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇటీవల భారీ వర్షాలతో ఘాట్ రోడ్డులో ఒకసారి కొండ చరియలు విరిగిపడగా.. కొద్ది రోజుల్లోనే మరో ఘటన జరిగింది. ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది గాయలపాలయ్యారు. మూలా నక్షత్రం కావటంతో... అత్యధిక మంది భక్తులు దుర్గమ్మ దర్శనాలకు వచ్చారు. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.

ఇంద్రకీలాద్రిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడి ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తోన్న ఏఈ చరణ్, పోలీసు కానిస్టేబుల్, పారిశుద్ధ్య సిబ్బంది గాయపడ్డారు. మధ్యాహ్నం 2.45  నిమిషాలకు దుర్గగుడికి సమీపంలోని భారీ కొండ చరియ ఒక్కసారిగా  విరిగి పడింది. భక్తుల కోసం వేసిన టెంటుపై పడటం వల్ల  ఒక్కసారిగా భారీ శబ్దంతో అది కూలిపోయింది. దీంతో టెంటు కింద ఉన్న సిబ్బంది, భక్తులు, మీడియా సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఘటనలో అక్కడే ఉన్న ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. భయాందోళన దృష్ట్యా మిగిలిన టెంటును అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మూలా నక్షత్రం కావడంతో మధ్యాహ్నం ౩.౩౦ గంటలకు సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. దీనికోసం అప్పటికి గంట ముందే  భక్తుల దర్శనాలను అధికారులు  నిలిపివేశారు.  ఆలయ ప్రధాన మార్గం వద్ద పూలు, పండ్లు,శాలువాలు సహా పూజా సామాగ్రిని ఏర్పాటు చేసిన అధికారులు సీఎం రాక కోసం వేచి చూస్తున్నారు.  ఈ సమయంలో పెద్ద శబ్దంతో కొండచరియలు విరిగి పడ్డాయి. ఘటనా ప్రాంతంలో  పోలీసులు , ఆలయ సిబ్బంది మాత్రమే ఉండటం, భయాందోళనలతో పరుగులు తీయడంతో పెను ప్రమాదం, ప్రాణ నష్టం తప్పింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సి రావడంతో మరో మార్గం ద్వారా సీఎం గుడికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపటికే అదే మార్గంమీదుగా  సీఎం వస్తారని సమాచారం అందింది. దీంతో ఆఘమేఘాల మీద అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  

కూలిన టెంటును తొలగించి సీఎం వెళ్లేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండరాళ్లు తొలగించే పనులను నిలిపివేసిన అధికారులు సీఎం ఏర్పాట్లు కొనసాగించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆలయ అర్చకులు సంప్రోక్షణ చేశారు. సాయంత్రం 5  గంటలకు సీఎం జగన్ ఆలయానికి వచ్చారు. సీఎంకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సరస్వతీ దేవీ రూపంలో కొలువైన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం జగన్ ..కొండ చరియల తొలగింపు సహా ఆలయ అభివృద్ది కి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేశారని అధికారులు తెలిపారు.

సీఎం వెళ్లిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కొండ చరియల కింద ఎవరైనా మరణించారా అనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మామూలు సమయంలో అయితే అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం ఘటన జరిగిన ప్రాంతం మీదుగానే భక్తులు తిరిగి వెళ్తుంటారు. మూలా నక్షత్రం కావడంతో ఇవాళ పెద్ద ఎత్తున దర్శనాలకు వచ్చారు. సీఎం రాక సందర్భంగా దర్శనాలు ఆపివేయడంతో ఆ మార్గంలో భక్తులు ఎవరూ లేరు. దీంతో పెను ప్రాణ నష్టం తప్పినట్లైంది.  

ఇదీ చదవండి  :   కొనసాగుతున్న అల్పపీడనం... విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

Last Updated : Oct 22, 2020, 12:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.