తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీర్లను విచారణ పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న పంచాయతీరాజ్ ఇంజినీర్లకు తెదేపా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తక్షణమే వేధింపులు నిలిపివేసి.. కూలీలు, మాజీ సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పనులు చేసిన వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనని..., బకాయిలు చెల్లించాలని కేంద్రం పంపిన నిధుల్ని దారి మళ్లించి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉపాధి కూలీల శ్రమను అవమానించారన్నారు. ఆయన క్షమాపణలు చెప్పటంతో పాటు తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: