ETV Bharat / city

పోలీసుల ప్రోద్బలంతోనే జేసీ ఇంటిపై దాడి: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

author img

By

Published : Dec 26, 2020, 3:29 PM IST

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరలు మారణాయుధాలతో జేసీ ఇంటికి వెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుంటే.. శాంతి చర్చల కోసం వెళ్లారని హోంమంత్రి, ఎస్పీ ధృవీకరించటం ఏంటంటూ.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల ప్రోద్బలంతోనే జేసీ నివాసం వద్ద ఘర్షణ చోటుచేసుకుందని ఆరోపించారు.

పోలీసుల ప్రోద్బలంతోనే జేసీ ఇంటిపై దాడి
పోలీసుల ప్రోద్బలంతోనే జేసీ ఇంటిపై దాడి

పోలీసుల ప్రోద్బలంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఘర్షణ చోటుచేసుకుందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు అనుచరులతో కలిసి దాడి చేస్తున్నా పట్టించుకోని పోలీసులు... ఆత్మరక్షణ కోసం ఎదురు దాడికి సిద్ధమైన బాధితులపై తుపాకులు ఎక్కుపెట్టారని వీడియోలు ప్రదర్శించారన్నారు. ఎమ్మెల్యే అనుచరులు కర్రలు, గొడ్డళ్లతో ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి వెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాలు స్పష్టంగా ఉంటే... శాంతి చర్చల కోసం వెళ్లారని హోంమంత్రి, జిల్లా ఎస్పీ ఎలా ధృవీకరించారని ప్రశ్నించారు.

"పెద్దారెడ్డి తనయుడు గుంపుతో కలిసి జేసీ నివాసంపైకి రాళ్లు విసిరటం, వాహనంతో తెదేపా కార్యకర్తలను గుద్ది చంపేందుకు చేసిన యత్నాలకు సంబంధించి స్పష్టమైన వీడియోలు ఉన్నాయి. అయినప్పటికీ జేసీ కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు ఎలా పెడతారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా జేసీ నివాసం ప్రహరీ గోడ వరకు పెద్దారెడ్డి అనుచరులు గుంపుగా ఎలా వచ్చారు. వారిని నియంత్రిస్తున్నట్లు పోలీసులు నటించి దాడికి ప్రోత్సహించారు. జరిగిన నేరంలో పోలీసులూ భాగస్వాములే అనటానికి వీడియోల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులపైనా చర్యలు ఉండాలి. వాస్తవాలు తెలుసుకొని హోంమంత్రి రాజీనామా చేస్తే ఆమెకు కొంచమైనా గౌరవం మిగులుతుంది." -దీపక్ రెడ్డి, ఎమ్మెల్సీ

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని దీపక్​రెడ్డి ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని చంపేసి రాచరిక పరిపాలన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ఉగ్రవాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. ప్రజలు మౌనం వహిస్తే బానిస బతుకులు తప్పవని అని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వైకాపా, తెదేపా శ్రేణులను చెదరగొట్టిన విశాఖ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.