'పేరుకే హైపవర్ కమిటీ...పవర్ అంతా సీఎం వద్దే' - Mlc Budda venkannh
పేరుకే హైపవర్ కమిటీ అని...పవర్ అంతా ముఖ్యమంత్రి జగన్ వద్దే ఉందని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. రాజధానులపై ప్రజాసేకరణ చేశామని చెప్పిన ప్రభుత్వం ఆ వివరాలను ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదన్నారు. ఆన్లైన్లో ఆ వివరాలు చూద్దామంటే ఎక్కడ కనిపించడం లేదన్నారు. రైతులు, ప్రజలను ఇంత మోసం చేసిన ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేరని విమర్శించారు. జగన్ కేబినెట్లో ఆన్లైన్, ఈ-మెయిల్స్ గురించి ఎంత మందికి తెలుసని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.